Lok Sabha Polls: 4 లోక్‌సభ స్థానాలు.. 200 సంకల్ప్‌ సభలు- ఆప్‌ నిర్ణయం

దిల్లీలో 200 సంకల్ప్‌ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆప్‌ పేర్కొంది.

Published : 15 Apr 2024 19:40 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ (AAP) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో 200 సంకల్ప్‌ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజల మద్దతు కూడగట్టనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత గోపాల్‌రాయ్‌ వెల్లడించారు. నాలుగు లోక్‌సభ స్థానాల పరిధిలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సభలు జరుగుతాయని.. వీటిలో ఆప్‌ సీనియర్‌ నేతలు, మంత్రులు పాల్గొంటారని తెలిపారు. సంకల్ప్‌ సభలకు రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్‌, గోపాల్‌రాయ్‌ అధ్యక్షత వహించనున్నారు.

‘కేజ్రీవాల్‌ను కరడుగట్టిన నేరస్థుడిలా చూస్తున్నారు’ - పంజాబ్‌ సీఎం ఆరోపణ

తూర్పు దిల్లీ లోక్‌సభ స్థానం పరిధిలోని విశ్వాస్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో గోపాల్‌రాయ్‌ తొలి సమావేశం నిర్వహించనున్నారు. దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో గత నెలలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేయగా.. జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా ప్రస్తుతం ఆయన తిహాడ్‌ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని