Chandra babu: లీగల్‌ ములాఖత్‌ల పెంపు పిటిషన్‌ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు

తెదేపా అధినేత చంద్రబాబును కలిసేందుకు లీగల్ ములాఖత్‌లను పెంచాలంటూ ఆయన తరఫు న్యాయవాదు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.

Updated : 20 Oct 2023 12:21 IST

విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబును కలిసేందుకు లీగల్ ములాఖత్‌లను పెంచాలంటూ ఆయన తరఫు న్యాయవాదు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ప్రతివాదుల పేర్లు చేర్చనందున ఇప్పుడు విచారణ అవసరం లేదని న్యాయాధికారి తెలిపారు. రోజుకు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్‌కు కోర్టు అనుమతించింది. 

న్యాయవాదులకు ఇచ్చే రోజుకు రెండు ములాఖత్‌లను జైలు అధికారులు ఒకటికి కుదించారరని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో కేసులు విచారణ జరుగుతున్న నేపథ్యంలో రోజుకు మూడు ములాఖత్‌లు ఇప్పించాలని కోరారు. కనీసం 45-50 నిమిషాలు చర్చించేందుకు అవకాశం ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని