Uttar Pradesh: అఖిలేశ్‌.. వన్‌ మ్యాన్‌ షో!

దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మెజార్టీ సీట్లు సాధించాలని ఉవ్విళ్లూరిన భాజపా ఆశలపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ నీళ్లు చల్లారు.

Updated : 05 Jun 2024 07:02 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో అన్నీ తానై చక్రం తిప్పిన నేత
ముస్లిం, దళిత, అల్పసంఖ్యాక వర్గాలను ఆకట్టుకోవడం సఫలీకృతం

లఖ్‌నవూ: దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో మెజార్టీ సీట్లు సాధించాలని ఉవ్విళ్లూరిన భాజపా ఆశలపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ నీళ్లు చల్లారు. తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ మరణం తర్వాత అఖిలేశ్‌ ఎదుర్కొన్న ఈ తొలి ఎన్నికలోనే పార్టీ మెరుగైన పనితీరును కనబర్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రచారంలో రాహుల్‌ గాంధీ, అఖిలేశ్‌లను ఉద్దేశించి ‘దో షెహజాదే’, ‘దో లడఖో కీ జోడీ’ అంటూ ప్రధాని మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. కానీ.. దళితులు, ముస్లింలు, ఇతర అల్పసంఖ్యాక వర్గాల ప్రజలు ఎస్పీకే అండగా నిలిచారు. అయోధ్య ఉన్న ఫైజాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలోనూ భాజపా పరాజయం పాలైందంటేనే ముస్లిం ఓటర్లను అఖిలేశ్‌ ఎలా ఆకట్టుకున్నారో అర్థమవుతోంది. కన్నౌజ్‌ నుంచి బరిలోకి దిగిన ఆయన, భార్యతోపాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులను గెలిపించే బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. ఆయన ప్రసంగాల్లో అధికశాతం కేజ్రీవాల్, హేమంత్‌ సోరెన్‌లను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. భాజపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ప్రజలను ఆలోచనలో పడేశారు. ఎన్నికలకు ముందు అఖిలేశ్‌ స్వయంగా వెళ్లి, అతడి బాబాయి శివపాల్‌ యాదవ్‌ను కలవడం అనూహ్య ఎత్తుగడ. ఈ చర్యతో యాదవ సామాజిక వర్గ ఓట్లను సంఘటితం చేయడంలో ఎస్పీ అధినేత సఫలీకృతమయ్యారనే చెప్పొచ్చు. పాత మిత్రపక్షమైన బీఎస్పీతో తెగదెంపులు.. పార్టీ ఓటు బ్యాంకుపై ఏమాత్రం ప్రభావం పడకుండా చూసుకున్నారాయన. అఖిలేష్‌ గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థులకు పెద్ద సంఖ్యలో ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. ఇవన్నీ ఆయనకు కలిసొచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు