TDP-Janasena: తెలుగుదేశం-జనసేన ప్రకటించిన తొలిజాబితాలో 99 మంది విద్యావంతులే

తెలుగుదేశం-జనసేన ప్రకటించిన తొలి జాబితాలోని 99 మంది అభ్యర్థుల్లో అందరూ విద్యావంతులు కావడం విశేషం.

Updated : 24 Feb 2024 17:01 IST

అమరావతి: తెలుగుదేశం-జనసేన ప్రకటించిన తొలి జాబితాలోని 99 మంది అభ్యర్థుల్లో అందరూ విద్యావంతులు కావడం విశేషం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనున్న రామాంజనేయులు ఐఏఎస్ కాగా, ముగ్గురు ఎంబీబీఎస్‌ చదివిన వైద్యులు, ఇద్దరు పీహెచ్‌డీ చేసిన డాక్టరేట్లు ఉన్నారు. మిగిలిన 93 మంది అభ్యర్థుల్లో 30 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, 63 మంది గ్రాడ్యుయేట్లు  ఉన్నారు. మొత్తం 99 మందిలో 13 మంది మహిళలకు చోటు దక్కింది. వయసురీత్యా చూస్తే 45 ఏళ్లలోపు పోటీ చేసేవారు 24 మంది ఉండగా.. 46 నుంచి 60 ఏళ్లలోపు వారు 55, 61 నుంచి 70 ఏళ్ల లోపు వారు 20 మంది ఉన్నారు. దాదాపు కోటి 3లక్షల మంది నుంచి అభ్యర్థుల ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ చేసినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికలో యువత, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు