Harish rao: కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల్లో ఒకే ఒక హామీ అమలైంది: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల్లో ఒకే ఒక హామీ అమలైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Published : 23 May 2024 15:46 IST

హనుమకొండ: కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల్లో ఒకే ఒక హామీ అమలైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా తుస్సేనని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయన హనుమకొండలో ప్రసగించారు. ‘ఉపాధ్యాయ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇవ్వకుండా కాంగ్రెస్‌ మోసం చేసింది. అందుకోసం అసెంబ్లీ, కౌన్సిల్‌లో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి పోరాడతాం. నారాయణఖేడ్‌లో ఉపాధ్యాయులపై లాఠీఛార్జి చేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. నిరుద్యోగ భృతి హామీపై నిలదీస్తే.. అలా చెప్పలేదని అసెంబ్లీలో భట్టి విక్రమార్క అంటున్నారు. కరెంటు బిల్లులు, భూముల రిజిస్ట్రేషన్‌ ఫీజులు పెంచడానికి సిద్ధమవుతున్నారు. ఒక వైపు సంక్షేమానికి కోతలు.. మరో వైపు వాతలా? అన్ని వర్గాలను మోసం చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని అయిపోయింది. అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబితే కాంగ్రెస్‌ దారికొస్తుంది.’’ అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు