BJP: యూట్యాక్స్‌పై మాత్రమే స్పందించారంటే ఎంత అవినీతి జరిగిందో..: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 19 ప్రశ్నలతో లేఖ రాస్తే.. ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారని భాజపా శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

Published : 27 May 2024 14:56 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 19 ప్రశ్నలతో లేఖ రాస్తే.. ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారని భాజపా శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పైరవీ చేసి భాజపా ఎల్పీ పదవి తెచ్చుకున్నానని చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఇది కాంగ్రెస్ కాదు. అందరి సమన్వయంతో నాకు భాజపాఎల్పీ నేతగా అవకాశం కల్పించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మీరు పీసీసీ పదవి ఎలా తెచ్చుకున్నారో నాకు తెలియదా..? మీలా దిగజారి ఆరోపణలు చేయలేను. మా అధ్యక్షుడి అనుమతితోనే సీఎంను కలవడానికి వెళ్లాను. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు స్పందించని ఉత్తమ్.. యూ ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు మాత్రం స్పందించారంటే అవినీతి ఎంత జరిగిందో అర్థం అవుతోంది. పౌరసరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు