Ambati Rayudu: చంద్రబాబు, పవన్‌ నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు: అంబటి రాయుడు

ఏపీలో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో తెదేపా, జనసేన, భాజపా కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.

Published : 04 Jun 2024 12:33 IST

అమరావతి: ఏపీలో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో తెదేపా, జనసేన, భాజపా కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌  చేతులు కలిపారని చెప్పారు. వారి నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర కూటమి విజయంలో ప్రధాన పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు