TDP: రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికల సంఘంపై వైకాపా దుష్ప్రచారం: అనగాని సత్యప్రసాద్‌

రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికల సంఘంపై వైకాపా దుష్ప్రచారానికి దిగుతోందని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ విమర్శించారు.

Published : 31 Mar 2024 10:30 IST

అమరావతి: రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికల సంఘంపై వైకాపా దుష్ప్రచారానికి దిగుతోందని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ విమర్శించారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను పంపిణీ చేయొద్దనే ఈసీ చెప్పిందని.. పథకాలు ఆపమని కాదన్నారు. వాళ్లు లేకుండా గతంలో పింఛన్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఈసీ మీద వంకతో ఈ నెల పంపిణీ చేయకుండా వృద్ధుల నోట్లో మట్టి కొట్టాలన్నదే జగన్ కుట్ర అని ధ్వజమెత్తారు. చివరి లబ్ధిదారుకి పింఛన్ ఇచ్చే వరకు వైకాపాను వదిలిపెట్టమని హెచ్చరించారు. సీఎం స్వార్థ రాజకీయాల వల్లే వీటి పంపిణీ బాధ్యత నుంచి వాలంటీర్లను ఎన్నికల కమిషన్ తప్పించిందని ఆరోపించారు.

‘‘ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక వాలంటీర్లను రాజకీయ ప్రచారం కోసం వాడొద్దని ఈసీ స్పష్టంగా చెప్పింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా వారి సహాయంతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. ఎన్నికల్లో గెలిచి తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం ఉన్న రూ.3 వేల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచి ఇంటి వద్దకే వెళ్లి అందిస్తాం. కోడ్ అమలులో ఉన్నప్పటికీ ప్రభుత్వం దొడ్డిదారుల్లో అస్మదీయులకు రూ.వేల కోట్ల బిల్లులు చెల్లించి ఖజానా ఖాళీ చేస్తోంది. రాష్ట్ర ప్రజలు వైకాపా కుట్రలను తిప్పికొట్టి, రాబోయే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పడం ఖాయం’’ అని అనగాని సత్యప్రసాద్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని