బిల్లుల అడ్డగోలు చెల్లింపులపై మా ప్రభుత్వం వచ్చాక విచారణ: ఆనం వెంకటరమణారెడ్డి

జగన్‌ ముద్దు బిడ్డ పీఎల్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అని..  వైకాపా పాలనలో ఆ సంస్థ లాభాలు బాగా పెరిగాయని  తెదేపా సీనియర్‌ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.

Published : 25 Feb 2024 12:54 IST

నెల్లూరు :  ఏపీ సీఎం జగన్‌ తనవారికి వెంటనే బిల్లులు చెల్లిస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. జగన్‌ ముద్దు బిడ్డ పీఎల్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అని..  వైకాపా పాలనలో ఆ సంస్థ లాభాలు బాగా పెరిగాయన్నారు.  నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘జగన్‌ మరో ముద్దు బిడ్డ షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌. బిల్లులు పెట్టిన వెంటనే ఈ సంస్థకు చెల్లింపులు జరుగుతున్నాయి. గతేడాది జులై నుంచి ఎంఎస్‌ఎంఈలకు చెల్లింపులు నిలిచిపోయాయి. వీటికి నెలన్నరలోనే చెల్లింపులు చేయాలని నిబంధనలు ఉన్నాయి. పీఎల్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు మాత్రం ఆరు నెలల్లోనే బిల్లులన్నీ చెల్లించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌కు కూడా వెంటనే చెల్లింపులు చేశారు. బిల్లుల అడ్డగోలు చెల్లింపులపై మా ప్రభుత్వం వచ్చాక విచారణ చేపడతాం’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని