Annamalai: 24గంటల ఫుడ్‌ బ్యాంక్‌లు, ఐఐఎం ఏర్పాటు: అన్నామలై హామీలు

కోయంబత్తూరు భాజపా అభ్యర్థి అన్నామలై ఆ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు.

Published : 13 Apr 2024 00:02 IST

కోయంబత్తూరు: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కోయంబత్తూరు నుంచి బరిలో ఉన్న తమిళనాడు భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamalai) జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 19న జరగబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే కోయంబత్తూరుకు ఐఐఎంతో పాటు ఎన్‌ఐఏ, ఎన్‌సీబీ విభాగాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 500 రోజుల్లో 100 హామీల కోసం పార్టీ కృషి చేస్తుందన్నారు.

కేజ్రీవాల్‌ ‘ఆలోచనలను’ నిర్బంధించలేరు - పంజాబ్‌ సీఎం

నవోదయ పాఠశాలల ఏర్పాటు, నొయ్యల్, కౌసికా నదుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA), నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (NCB) యూనిట్‌లను కోయంబత్తూరులో ఏర్పాటు చేస్తామన్నారు. లెజెండరీ నేత, మాజీ సీఎం కె.కామరాజ్ పేరిట 24 గంటల పాటు పనిచేసే ఫుడ్‌ బ్యాంకులను ప్రవేశపెడతామని ప్రకటించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతాన్న అన్నామలై.. ప్రజలు తనను ఆశీర్వదిస్తే కోయంబత్తూరును అంతర్జాతీయ ముఖచిత్రంపై నిలుపుతానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని