Modi 3.0 Cabinet: ఏపీ నుంచి మరొకరికి కేంద్రమంత్రి పదవి

ఏపీ నుంచి మరొకరికి కేంద్రమంత్రి పదవి దక్కనుంది. భాజపాకు చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు.

Updated : 09 Jun 2024 13:32 IST

అమరావతి: ఏపీ నుంచి మరొకరికి కేంద్రమంత్రి పదవి దక్కనుంది. భాజపాకు చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.76లక్షల ఓట్ల మెజార్టీతో శ్రీనివాస వర్మ ఘన విజయం సాధించారు. ఇప్పటికే ఏపీ నుంచి తెదేపా ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రివర్గంలో బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. 

శ్రీనివాస వర్మ దశాబ్దాలుగా భాజపాకు సేవలందిస్తున్నారు. 1988లో ఆ పార్టీ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1992-95లో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు భాజపా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గానూ సేవలందించారు. తాజాగా నరసాపురం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో బెర్తు ఖరారైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు