Himachal Crisis: రాబోయే రోజుల్లో ‘హిమాచల్‌’లో ఏదైనా జరగొచ్చు.. జైరాం ఠాకూర్‌

రాబోయే రోజుల్లో హిమాచల్‌ప్రదేశ్‌లో ఏదైనా జరగొచ్చని.. భాజపా శ్రేణులు సిద్ధంగా ఉండాలని ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జైరాం ఠాకూర్‌ విజ్ఞప్తి చేశారు.

Published : 03 Mar 2024 18:11 IST

శిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగడం కష్టమేనంటూ ప్రతిపక్ష నేత , మాజీ సీఎం జైరాం ఠాకూర్‌ (Jairam Thakur) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చని.. అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన తమ పార్టీ శ్రేణులను కోరారు. శిమ్లాలో త్రిదేవ్ సమ్మేళనం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా ఉండటం వల్ల ఆ పార్టీ అధికారంలో కొనసాగడం కష్టమన్నారు.

సంక్షోభం అంచునే హిమాచల్‌.. రెబల్ వర్గం వైపు మరికొందరు ఎమ్మెల్యేలు

మంత్రులు సైతం ఇప్పుడు కేబినెట్‌ మీటింగ్‌ నుంచి బయటకు వచ్చేస్తున్నారన్నారు. శనివారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో హైడ్రామా చోటుచేసుకుందని.. రెవెన్యూశాఖ మంత్రి జగత్‌ నేగి సమావేశం మధ్యలోనే వెళ్లిపోగా.. విద్యా మంత్రి రోహిత్ ఠాకూర్ కూడా తీవ్రమైన వాదనల తర్వాత సమావేశం నుంచి వాకౌట్‌ చేసినట్లు జైరాం ఠాకూర్‌ తెలిపారు. ఆగస్టు 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం తొమ్మిది మంది భాజపాకు అనుకూలంగా ఓటు వేయడంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కును కోల్పోయిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు