కేంద్రానికి కాకపోతే బైడెన్‌కి చెప్పుకోండి.. ఎవరికి భయం?: పవన్‌కి మంత్రి అమర్‌నాథ్‌ కౌంటర్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కేంద్రంలో అంత పలుకుబడి ఉంటే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌ విసిరారు.

Updated : 11 Aug 2023 10:30 IST

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కేంద్రంలో అంత పలుకుబడి ఉంటే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌ విసిరారు. వారాహి యాత్రలో భాగంగా విశాఖలో పర్యటించిన పవన్‌.. స్టీల్‌ప్లాంట్‌ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

ఆంధ్రా వీరప్పన్‌ జగన్‌

సీఎం జగన్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేంద్రానికి చెబితే ఎవరికి భయం? మేం చేసిన తప్పేంటి? ఎవరికో చెబితే భయపడే ప్రభుత్వం జగన్‌ది కాదని తెలుసుకోవాలి. కేంద్రానికి కాకపోతే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి చెప్పుకోండి’’ అని అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని