Telangana BJP: భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల సందడి..

భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల సందడి నెలకొంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకున్నారు.

Updated : 04 Sep 2023 19:30 IST

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల సందడి నెలకొంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకున్నారు. మొదటి రోజు ఆశావహుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇవాళ మొత్తం 182 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి దరఖాస్తు సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి హరిప్రసాద్‌ గౌడ్‌ సమర్పించారు. వేములవాడ టికెట్ కోసం తుల ఉమ దరఖాస్తు చేసుకున్నారు. ఎల్బీనగర్‌ అసెంబ్లీ టికెట్ కోసం సామ రంగారెడ్డి ఆసక్తి చూపారు. అలాగే సరూర్‌నగర్‌ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి.. నాలుగు స్థానాలు మహేశ్వరం, ఎల్బీనగర్, సనత్‌నగర్, ముషీరాబాద్‌ నియోజకవర్గాలకు దరఖాస్తు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని