Atchannaidu: గులకరాయి డ్రామా.. జగన్‌లో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి: అచ్చెన్నాయుడు

సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు సీఎం జగన్ కుట్ర చేశారని తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Published : 17 Apr 2024 12:31 IST

అమరావతి: సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు సీఎం జగన్ కుట్ర చేశారని తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో కోడికత్తి డ్రామాలో దళిత బిడ్డను ఐదేళ్ల పాటు జైలు పాల్జేశారని మండిపడ్డారు. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో తెదేపాకు సంబంధం ఏమిటని, తమపై నెట్టడానికి సిగ్గనిపించడం లేదా అని ఆ్రగహం వ్యక్తం చేశారు. 

‘‘ఇప్పుడు అధికారంలో ఉన్నందున ఈ ఘటనకు బాధ్యత వహించాల్సింది మీరే. చిన్న గులకరాయి తగిలితే ఏదో జరిగిపోయిందంటూ డ్రామాలాడుతున్నారు. జగన్ రెడ్డిలో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. రాజకీయాలకు బదులు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి ఉంటే దేశం గర్వించే మంచి నటుడు అయ్యేవారు. 24 క్లైమోర్‌మెన్ బాంబులు పేలి 15 అడుగుల మేర ఎగిరి పడిన వ్యక్తి కూడా ఏ రోజూ సానుభూతి కోసం ప్రయత్నించలేదు. కానీ.. గులకరాయి తగిలితే సానుభూతి డ్రామాలు ఆడటానికి సిగ్గుగా లేదా? ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు’’ అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని