Atchannaidu: తెదేపాపై వైకాపా విష ప్రచారం: అచ్చెన్నాయుడు

పింఛన్లు పంపిణీ చేయకుండా తెదేపా అడ్డుపడుతోందంటూ వైకాపా విష ప్రచారం చేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) ఆరోపించారు.

Updated : 31 Mar 2024 14:05 IST

అమరావతి: పింఛన్లు పంపిణీ చేయకుండా తెదేపా అడ్డుపడుతోందంటూ వైకాపా విష ప్రచారం చేస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) ఆరోపించారు. వైకాపా నేతలు ఎన్నికల సంఘం ఆదేశాలను వక్రీకరించి వాలంటీర్లకు వాయిస్‌ మెసేజ్‌లు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలు ఫిర్యాదు చేయడం వల్లే పింఛను పంపిణీ నిలిపివేసినట్లు పెన్షన్‌ దారులకు చెప్పాలని ఆదేశాలిచ్చారని మండిపడ్డారు. పింఛన్ల రూపంలో ఇవ్వాల్సిన రూ.2వేల కోట్లను బిల్లుల రూపంలో సీఎం జగన్‌, మంత్రి బుగ్గన తమ అస్మదీయులకు చెల్లించారన్నారు. ఖజానాలో డబ్బు లేకుండా చేసి ఇప్పుడు తమపై అభాండాలు వేస్తున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని