Atchannaidu: మీ బాబాయి కూతురు వ్యాఖ్యలకు జవాబు చెప్పు జగన్‌: అచ్చెన్నాయుడు

సీఎం జగన్‌పై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Updated : 01 Mar 2024 21:57 IST

టెక్కలి: సీఎం జగన్‌పై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం విశ్వనాథపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివేకా కుమార్తె సునీత  మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

‘‘రాష్ట్రంలో మళ్లీ జగన్‌కు ఓటేస్తే మన జీవితాలు నాశనం చేసుకున్నవాళ్లమవుతామని సునీత అన్నారు. మన ప్రాంతాల్లో హత్యలు జరిగితే పోలీసులు ఐదారు రోజుల్లోనే గుర్తించి అరెస్టు చేస్తారు. సాక్షాత్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చిన్నాన్నను చంపితే ఐదేళ్లయినా ఎవరు చంపారో చెప్పలేని వ్యక్తి జగన్‌. చెల్లి, తల్లి, సొంత మనుషులను మోసం చేశారు. ఆయన ధ్యాసంతా ఒక్కటే.. రాష్ట్రంలో అవినీతి డబ్బంతా తన వద్దే ఉండాలి. ఏం చేసైనా మళ్లీ అధికారంలోకి రావాలి. రాష్ట్రంలో ఇంకో రాజకీయ పార్టీ ఉండకూడదని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. మరోసారి వైకాపా అధికారంలోకి వస్తే  ఈ రాష్ట్రం పరిస్థితి ఏమిటో ప్రజలే అర్థం చేసుకోవాలి’’ అని అచ్చెన్నాయుడు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని