TDP: భాజపాతో మాట్లాడుతున్నాం.. పొత్తుపై త్వరలో ప్రకటన: అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని, దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.. దాపరికం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Updated : 22 Feb 2024 19:22 IST

విజయవాడ: తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని, దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.. దాపరికం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. భాజపాతో మాట్లాడుతున్నాం.. పొత్తు గురించి త్వరలోనే ప్రకటన ఉంటుందన్నారు. తెదేపా- జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో 2 తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపారు. పొత్తును స్వాగతించిన తెదేపా-జనసేన కేడర్‌ను అభినందిస్తూ తీర్మానం చేశామన్నారు. మీడియాపై దాడులను తప్పు పడుతూ సమన్వయ కమిటీ రెండో తీర్మానం చేసిందన్నారు. 

ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోందని, త్వరలో విడుదల చేస్తామని సమావేశం ముగిసిన తర్వాత అచ్చెన్న మీడియాకు తెలిపారు. ఏయే స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనేది చంద్రబాబు, పవన్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు. పొత్తులు పెట్టుకొనే సమయంలో కొన్ని త్యాగాలు తప్పవని, టికెట్లు కోల్పోయిన వాళ్లు బాధపడొద్దని అధినేతలిద్దరూ చెప్పారని గుర్తు చేశారు. తెదేపా- జనసేన మధ్య గొడవలు పెట్టేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వాలంటీర్ల గురించి మాట్లాడిన మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు చేసినట్టు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని