TG News: కాంగ్రెస్‌ అధికారంలో దాడులు పెరిగాయి..: మాజీ మంత్రి హరీశ్‌రావు

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే భారాస నేతలపై దాడులు పెరిగాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

Updated : 23 May 2024 11:36 IST

కొడిమ్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ధాన్యం విక్రయం కోసం నెలరోజులుగా పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పర్యటించిన ఆయన.. పూడురులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ‘‘గత ప్రభుత్వం 67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ప్రస్తుతం 37 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొన్నారు. రైతులంతా హైదరాబాద్‌కు వచ్చి ఉద్యమం చేస్తామంటున్నారు’’ అని పేర్కొన్నారు.

వనపర్తిలో భారాస నేత శ్రీధర్‌ హత్య ఘటనను హరీశ్‌రావు ఈ సందర్భంగా ఖండించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే దాడులు పెరిగాయని ఆరోపించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోనే ఇద్దరు భారాస నేతలు హత్యకు గురయ్యారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను కాంగ్రెస్‌ ప్రభుత్వం భయపెట్టలేదని స్పష్టం చేశారు. భారాస శ్రేణులు ధైర్యం కోల్పోవద్దని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని