Balakrishna: ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌: బాలకృష్ణ

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు, తెదేపా నేతలు నివాళులర్పించారు.

Updated : 28 May 2024 10:41 IST

హైదరాబాద్‌: తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు, తెదేపా నేతలు నివాళులర్పించారు. నగరంలోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, తెదేపా సీనియర్‌ నేత బక్కని నర్సింహులు తదితరులు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ సేవలను కొనియాడారు. 

‘‘ఎన్టీఆర్‌ అంటే ఒక శక్తి. తెలుగువారికి ఆయన ఆరాధ్య దైవం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్‌.. తొలుత చదువుకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత చిత్రరంగంలోకి వచ్చారు. ఎన్టీఆర్ అంటే నటనకు విశ్వవిద్యాలయం. సినీ రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఒకే పంథాలో వెళ్తున్న రాజకీయాలను మార్చారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు. అంతకుముందు రాజకీయాలంటే కొంతమందికే పరిమితమై ఉండేవి. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చాక డాక్టర్లు, లాయర్లు, అభిమానులను రాజకీయాల్లోకి ఆయన తీసుకొచ్చారు. అధికారానికి దూరంగా ఉన్న బడుగు, బలహీనవర్గాలకు పదవులు కట్టబెట్టారు. ప్రభుత్వంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన పెట్టిన పథకాలనే ఇప్పుడు అన్ని పార్టీలు అవలంబిస్తున్నాయి’’అని బాలకృష్ణ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని