Bandi Sanjay: గ్రూప్‌ -1 పరీక్ష నిర్వహించే సత్తాలేని సర్కారు ఇది: బండి సంజయ్‌

గ్రూప్‌ -1 పరీక్షను సరిగ్గా నిర్వహించే సత్తాలేని సర్కారు భారాస అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) విమర్శించారు.

Updated : 25 Sep 2023 14:35 IST

కరీంనగర్‌: గ్రూప్‌ -1 పరీక్షను సరిగ్గా నిర్వహించే సత్తాలేని సర్కారు భారాస అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ నిర్వాకంతో 30 లక్షల మంది నిరుద్యోగుల బతుకులు రోడ్డున పడ్డాయన్నారు. యువత భవిష్యత్‌ నాశనమవుతుంటే సీఎం కేసీఆర్‌ నోరెత్తటం లేదన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన పండిట్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి వేడుకల్లో సంజయ్‌ పాల్గొన్నారు.

గణపయ్య బంగారు లడ్డూ వేలం.. ఎంత ధర పలికిందంటే?

ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘రూ.లక్షలు ఖర్చు చేసిన పరీక్షకు సిద్ధమైన వారికీ ఉద్యోగాలపై ఆశ లేకుండా పోయింది. టెన్త్‌, ఇంటర్‌, గ్రూప్‌ -1 సహా అన్ని పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైంది. నిరుద్యోగ భృతి బకాయిలతో సహా చెల్లించాకే వచ్చే ఎన్నికల్లో భారాస ఓట్లు అడగాలి’’ అని డిమాండ్‌ చేశారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు