అసెంబ్లీలో ఆ సమస్యను ప్రస్తావించడం అభినందనీయం.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్‌ లేఖ

సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)కి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) లేఖ రాశారు. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలన్నారు.

Published : 18 Dec 2023 16:57 IST

హైదరాబాద్‌: త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)కి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) లేఖ రాశారు. మిడ్‌ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని చెప్పారు. ఈ మేరకు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో సంజయ్‌ ప్రస్తావించారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి రూ.5.04 లక్షల చెల్లించాలని విన్నవించారు. నీలోజిపల్లి నుంచి నందిగామ అగ్రహారం వరకు ఇండస్ట్రీయల్ కారిడార్‌తో పాటు స్కిల్ డెవలప్‌మెంట్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌ సహా మాజీ సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ను సంజయ్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని