Eatala Rajender: భాజపా నేత ఈటల రాజేందర్‌ గృహనిర్బంధం

భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను హైదరాబాద్‌లో పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Updated : 20 Jul 2023 08:55 IST

హైదరాబాద్‌: భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను హైదరాబాద్‌లో పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈటలతో పాటు భాజపా నేత, మాజీ మంత్రి డీకే అరుణను కూడా పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి నేతృత్వంలో బాటసింగారంలో రెండు పడక గదుల ఇళ్ల పరిశీలనకు వెళ్తామని భాజపా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జంట నగరాల్లో పలువురు భాజపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేసినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని