Lok Sabha elections: ఆ ఒక్క సీటు మినహా యూపీలో భాజపాకు ఓటమే: అఖిలేశ్‌

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Published : 21 May 2024 20:51 IST

అజంగఢ్‌: లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ఉత్తర్‌ప్రదేశ్‌లో ‘ఇండియా’ కూటమికి  విశేష స్పందన వస్తోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh yadav)అన్నారు. ప్రధాని మోదీ పోటీ చేస్తోన్న వారణాసి మినహా మిగతా అన్నిచోట్లా భాజపా ఓడిపోతుందని వ్యాఖ్యానించారు. లాల్‌గంజ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం చేసిన అఖిలేశ్‌..  ఈసారి ఎలాంటి వ్యూహాలతో వచ్చినా యూపీ ప్రజలు భాజపాను తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారన్నారు. వారణాసి నియోజకవర్గాన్ని క్యోటో నగరంగా పేర్కొన్న ఆయన.. భాజపా ఒకే ఒక్క సీటులో మాత్రమే గెలుస్తుందని.. అది కూడా క్యోటోలోనే అన్నారు. మిగతా అన్ని సీట్లలోనూ ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.

రత్న భాండాగారంపై మోదీ వ్యాఖ్యలు.. ధ్వజమెత్తిన స్టాలిన్‌

వారణాసిని జపాన్‌లోని క్యోటో నగరంగా అభివృద్ధి చేస్తానంటూ ప్రధాని నరేంద్ర మోదీ గతంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో సెటైరికల్‌గా ఆ పేరును అఖిలేశ్‌ ప్రస్తావించారు. ఎన్నికలు మొదలైనప్పుడు భాజపా 400 సీట్లు దాటుతాయంటూ నినదించిందని..  ఇప్పుడేమో ప్రజలు 400 సీట్లలో ఓడిస్తామంటున్నారన్నారు. ఈసారి 140 కోట్ల మంది ప్రజలు భాజపాకు 140 సీట్లు కూడా ఇవ్వరన్నారు. భాజపా ఇచ్చిన ప్రతి హామీ బూటకమేనంటూ మండిపడ్డారు. అఖిలేశ్‌ సభావేదిక వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పెద్దసంఖ్యలో జనం దూసుకురావడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు