Bonda Uma: పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా

వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు.

Published : 24 Apr 2024 11:23 IST

విజయవాడ: వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులో ఇరికించే యత్నం చేసిన సీపీపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని అన్నారు. వైకాపా పరిధిలో కాకుండా తాము ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలని తెలిపారు. విజయవాడ సెంట్రల్‌లో ఏసీపీ, సీఐలు వెలంపల్లి కనుసన్నల్లో నడుస్తున్నారని విమర్శించారు. వీరిపైనా చర్యలు కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. సెర్ప్‌ సీఈవో మురళీధర్‌రెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పించి మే 1న ఇంటి వద్దే ఫించన్లు పంపిణీ చేసేలా మార్గం సుగమం చేయాలని బొండా ఉమా డిమాండ్‌ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు పని చేయాలని తెలిపారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని