Bonda Uma: జగన్‌ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే: బొండా ఉమ

సీఎం జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనని తెదేపా నేత బొండా ఉమ హెచ్చరించారు.

Updated : 21 May 2024 15:38 IST

అమరావతి: సీఎం జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనని తెదేపా నేత బొండా ఉమ హెచ్చరించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘సిట్ నివేదికను డీజీపీ వెంటనే బయటపెట్టాలి. తెదేపా నేతలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి. రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి సోదరులు, భూమన కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డిపై  చర్యలు తీసుకోవాలి. సస్పెండ్ అయిన అధికారుల కాల్ డేటాను బయటకు తీయాలి. అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటాను బయటకు తీసి అరెస్టు చేయాలి. వైకాపా నేతల ఇళ్లలో బాంబులు, వేట కొడవళ్లు దొరికినా కేసులు నమోదు చేయకపోవడం దారుణం. ఆ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని బొండా ఉమ డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని