TS Elections: కల్వకుర్తిలో కాంగ్రెస్‌, భారాస శ్రేణుల ఘర్షణ

అసెంబ్లీ ఎన్నికల (Telangana Election 2023) నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Published : 29 Nov 2023 15:59 IST

కల్వకుర్తి: అసెంబ్లీ ఎన్నికల (Telangana Election 2023) నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్లకు కాంగ్రెస్‌ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ భారాస నేతలు దాడికి దిగారు. అధికార పార్టీ నేతల దాడికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అడ్డుకుని చెదరగొట్టారు. అనంతరం పురపాలక ఛైర్మన్‌, భారాస నేత తమపై దాడి చేశారని కాంగ్రెస్‌ నాయకులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని