BRS: మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన భారాస

లోక్‌సభ ఎన్నికలకు భారాస మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను ప్రకటించారు.

Updated : 22 Mar 2024 16:03 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు భారాస (BRS) మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మెదక్‌ లోక్‌సభ స్థానానికి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వరంగల్‌ - డాక్టర్ కడియం కావ్య, జహీరాబాద్‌ - అనిల్‌కుమార్‌, నిజామాబాద్‌ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌, కరీంనగర్‌ నుంచి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం - నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత, మహబూబ్‌నగర్‌- మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మల్కాజిగిరి - రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌ - ఆత్రం సక్కును ఆ పార్టీ ప్రకటించింది. ఇప్పటి వరకు 13 స్థానాలకు భారాస అభ్యర్థులను ఖరారు చేసింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నల్గొండ, భువనగిరి స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని