BRS: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు కాంగ్రెస్‌ కుట్ర: మన్నె క్రిశాంక్‌

కొత్త బ్రాండ్ల పేరిట రాష్ట్రానికి మద్యం తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని భారాస నేత మన్నె క్రిశాంక్‌ విమర్శించారు.

Updated : 27 May 2024 19:39 IST

హైదరాబాద్‌: కొత్త బ్రాండ్ల పేరిట రాష్ట్రానికి మద్యం తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని భారాస నేత మన్నె క్రిశాంక్‌ విమర్శించారు. కొత్త బ్రాండ్ల మద్యానికి రాష్ట్రంలో అవకాశం ఇవ్వలేదని మంత్రి జూపల్లి చెప్పారని, అందంతా అబద్ధమని తేలిపోయిందన్నారు. సోం డిస్టిలరీస్‌ కంపెనీ ద్వారా కొత్త బీర్‌ కంపెనీని తెలంగాణకు తీసుకొస్తున్నారని, ఆ కంపెనీని గతంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధించిందని గుర్తు చేశారు. పార్టీ ఫండ్‌ కోసమే రాష్ట్రానికి కొత్త మద్యం కంపెనీలు తీసుకొస్తున్నారని క్రిశాంక్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని