ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి: కేంద్రానికి హరీశ్‌రావు పోస్టుకార్డు

ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ కేంద్రానికి తెలంగాణ మంత్రి హరీశ్ రావు పోస్టుకార్డు రాశారు. ఉపాధిహామీపై పోస్టుకార్డుల ఉద్యమాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టారు.

Updated : 15 Apr 2023 15:00 IST

సిద్దిపేట: ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ కేంద్రానికి తెలంగాణ మంత్రి హరీశ్ రావు పోస్టుకార్డు రాశారు. ఉపాధి హామీపై పోస్టుకార్డుల ఉద్యమాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వానికి హరీశ్ లేఖ రాశారు.

‘‘ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేయాలని చూస్తోంది. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.30 వేల కోట్ల కోత విధించింది. దీంతో ఉపాధి కూలీలకు పని దినాలు తగ్గాయి. రోజుకు రూ.257 ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ, ఒక్కో కూలీకి రూ.100 కూడా ఇవ్వడం లేదు. పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలూ కల్పించడం లేదు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానించాలని సీఎం కేసీఆర్ శాసనసభలో తీర్మానం చేశారు. అనుసంధానించడం ద్వారా రైతులకు గిట్టుబాటు కూలీ లభిస్తుంది. ఫీల్డ్ అసిస్టెంట్లు మొదలు ఏపీఓల వరకు ఉపాధి హామీ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి’’ అని కేంద్రానికి రాసిన పోస్ట్‌కార్డులో హరీశ్‌రావు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని