KCR: ప్రజాతీర్పును గౌరవిద్దాం.. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం: కేసీఆర్‌

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత కేసీఆర్‌ (KCR)ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కలిశారు.

Updated : 04 Dec 2023 20:55 IST

ములుగు: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత కేసీఆర్‌ (KCR)ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికైన భారాస ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిద్దామని, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని చెప్పారు. ఏమి జరుగుతుందో వేచి చూద్దామన్నారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష కోసం త్వరలో పార్టీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శాసనసభాపక్ష నేతను త్వరలో ఎన్నుకుందామని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు