Chhattisgarh polls: పోలింగ్‌ సమీపిస్తున్న వేళ ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర .. ఓ జవాన్‌కు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) మందుపాతర పేలుడు కారణంగా ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ గాయపడ్డారు. పోలింగ్‌ విధులకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Published : 06 Nov 2023 19:40 IST

రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం తొలివిడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నక్సలైట్లు మందుపాతర పేల్చడంతో ఓ జవాన్‌, ఇద్దరు పోలింగ్‌ సిబ్బంది గాయపడ్డారు. కాంకర్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు కారణంగా బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ ప్రకాశ్ చంద్‌ గాయపడినట్లు తెలిసింది. అతడి కాలుకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరు పోలింగ్‌ సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికంగానే చికిత్స అందజేశారు. 

నవంబర్ 17వరకు ఎంజాయ్ చేయండి: బెట్టింగ్ యాప్ వివాదం వేళ భాజపాపై బఘేల్‌ విమర్శలు

కాంకర్‌ జిల్లాలోని రేంగాఘాటి రేంగాగొండి పోలింగ్‌ స్టేషన్‌లో విధులు నిర్వహించడానికి కొందరు పోలింగ్‌ సిబ్బంది, పోలీసులను ఎన్నికల అధికారులు ఎంపిక చేశారు. వారంతా మెర్బడా క్యాంప్‌ నుంచి బీఎస్‌ఎఫ్‌ బందోబస్తు సాయంతో బయలుదేరారు. మార్గం మధ్యలో ఉండగానే.. మందుపాతర పేలుడు చోటు చేసుకున్నట్లు తెలిసింది. పోలింగ్‌ తేదీకి ఒక్కరోజు ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబరు 7న తొలి విడత, 17న మలి విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని