Politics news: మోదీతో లంచ్‌.. కొన్ని వారాలకే భాజపాలో చేరిన బీఎస్పీ ఎంపీ

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ బీఎస్పీకి షాక్‌ తగిలింది. ఎంపీ రితేశ్‌ పాండే రాజీనామా చేసి భాజపాలో చేరారు. 

Updated : 25 Feb 2024 18:55 IST

లఖ్‌నవూ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పార్టీ ఫిరాయింపులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా బహుజన్‌ సమాజ్‌ పార్టీ (BSP)కి షాక్‌ తగిలింది. లోక్‌సభ ఎంపీ రితేశ్‌ పాండే (Ritesh Pandey) బీఎస్పీకి ఆదివారం రాజీనామా చేశారు. ఆపై వెంటనే భాజపాలో చేరారు. నేటి ఉదయం ఆయన పార్టీ అధినేత్రి మాయావతికి రాజీనామా పత్రాన్ని అందించారు.

పార్టీలో చాలా కాలంగా తనకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. మాయావతిని కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలనుకుంటున్నానని.. అందుకే రాజీనామాకి సిద్ధమయినట్లు పేర్కొన్నారు. కాషాయ కండువా కప్పుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఉద్యోగాలే ఉంటే రోజులో 12 గంటలు మొబైల్స్‌ చూస్తారా?: రాహుల్‌

ఇటీవల పార్లమెంట్‌ క్యాంటీన్‌లో ప్రధాని మోదీతో కలిసి భోజనం చేశానని.. ఆ సమయంలో ఆయన నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని తెలిపారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ దేశ భవిష్యత్తు పట్ల ఎంతో ముందుచూపుతో ఉన్నారు. ఆయన దార్శనికత నాలో స్ఫూర్తిని నింపింది. అందుకే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన వెంట నడవాలనుకున్నా. అందుకోసం బీఎస్పీని వీడి భాజపాలో చేరా’’ అని అన్నారు. అంబేడ్కర్‌ నగర్‌కి పాండే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన తండ్రి రాకేశ్‌ పాండే కూడా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని