Buggana rajendranath: ఆంధ్రప్రదేశ్‌ అప్పులపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అప్పులపై గత కొన్ని రోజులుగా వివిధ రకాలుగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిపై స్పందిస్తూ రాష్ట్ర అప్పులపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

Updated : 03 Aug 2023 16:57 IST

అమరావతి: వైకాపా హయాంలో కేవలం 3 శాతమే అప్పులు పెరిగాయని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం, విద్యుత్‌ సంస్కరణల అమలుతో అదనపు రుణాలకు అనుమతి లభించిందన్నారు. నాలుగేళ్లలో రెవెన్యూ రాబడి కూడా 16.7 శాతం పెరిగిందన్నారు. వైకాపా వచ్చాక రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.11 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. డిస్కమ్‌లతో పాటు ఇప్పటివరకు రూ.7వేల కోట్ల అప్పు తీర్చామన్నారు. రాష్ట్రం ఇచ్చిన లెక్కలన్నీ కాగ్, ఆర్‌బీఐ ధ్రువీకరించినవే అని బుగ్గన స్పష్టం చేశారు. ప్రజాపద్దులకు సంబంధించి వైకాపా ప్రభుత్వం రూ.3,471 కోట్లు బకాయిపడిందన్నారు. పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించినట్లు రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించినప్పటికీ రూ.28,466 కోట్లు అప్పు తీసుకోలేదని చెప్పారు. ఉద్యోగుల పీఎఫ్‌, ఇతర డిపాజిట్లు వాడుకున్న మాట వాస్తవమే అని బుగ్గన వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని