Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు.. ఏలూరులో కొవ్వొత్తుల ప్రదర్శన

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏలూరు జిల్లా దెందులూరులోని పలు గ్రామాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.

Updated : 11 Sep 2023 22:40 IST

దెందులూరు: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసి.. జైలుకు పంపడాన్ని నిరసిస్తూ.. ఏలూరు జిల్లా దెందులూరులోని పలు గ్రామాల్లో  ఆ పార్టీ కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు పర్వతనేని రంగారావు, తెలుగు యువత అధ్యక్షుడు మోత్కూరి నరసింహ శోభన్‌ బాబు ఆధ్వర్యంలో సత్యనారాయణపురం, శ్రీరామవరం తదితర గ్రామాల్లో మహిళలు, పురుషలు పెద్ద సంఖ్యలో ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబుపై అక్రమ కేసును ఎత్తివేయాలని నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టారు. సైకో పోవాలి సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని