Chandrababu: జగన్‌ ఇక జన్మలో సీఎం కాలేరు: చంద్రబాబు

గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు ఐకమత్యంతో పని చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 19 Apr 2023 15:04 IST

బద్వేల్: గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు ఐకమత్యంతో పని చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంధువులు, రక్త సంబంధీకులు వదిలేసినా పార్టీ వెంట ఉంటుందని కార్యకర్తలకు సూచించారు. తెదేపా పాలన వల్ల విదేశాల్లో స్థిరపడిన వారంతా పార్టీకి విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. రూ.5వేలు విరాళం ఇచ్చిన వారికి జీవితకాల సభ్యత్వం ఇస్తామని.. కార్యకర్తలను ఆదుకునే బాధ్యత పార్టీదే అని చెప్పారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేశారు. ‘‘జగన్‌ ఎక్కడ ఉంటే.. అక్కడ శనే.. జగన్‌ ఓ ఐరన్‌లెగ్‌. అమరావతిని నాశనం చేశారు. ఇప్పుడు విశాఖ నుంచి పాలిస్తానని చెబుతున్నారు. ఆయన్ను చూసి విశాఖ వాసులు భయపడుతున్నారు. జగన్‌ పదవికి ఎక్స్‌పైరీ డేట్‌ వచ్చేసింది. ఇకపై జన్మలో ఆయన సీఎం కాలేరు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని