Chandrababu: గత హామీలపై బదులిచ్చాకే బస్సు యాత్ర చేయాలి: చంద్రబాబు

జగన్‌ గత హామీలపై బదులిచ్చాకే.. బస్సు యాత్ర చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Updated : 21 Mar 2024 20:09 IST

అమరావతి: జగన్‌ గత హామీలపై బదులిచ్చాకే.. బస్సు యాత్ర చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ఆయన పోస్టు చేశారు. ఐదేళ్ల పదవీ కాలాన్ని దోపిడీకి వెచ్చించారని విమర్శించారు. 99 శాతం హామీల అమలు అనే జగన్‌ మాట బూటకమని విమర్శించారు. విశ్వసనీయతపై సీఎం కబుర్లు అతిపెద్ద నాటకమంటూ ధ్వజమెత్తారు. జగన్‌ మోసాలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విడుదల చేసిన వీడియోను చంద్రబాబు రీపోస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని