Chandrababu: రాజకీయ కారణాలతో టీచర్‌ను చంపడం దారుణం: చంద్రబాబు

విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యను తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.

Updated : 16 Jul 2023 11:31 IST

రాజాం: విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యను తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కారణాలతో ఒక టీచర్‌ను చంపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలకు ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఉదాసీన వైఖరే కారణమని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు.

రాజాంలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ (58) శనివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ను ప్రత్యర్థి వర్గం బొలెరో వాహనంతో ఢీకొట్టి హతమార్చి.. రోడ్డుప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అక్కడి పరిస్థితులను చూసి ఇది హత్యేనని కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు విచారణ చేపట్టగా, హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని నిర్ధారణ అయింది. మృతుడి కుమారుడు శ్రావణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన మరడాన వెంకటనాయుడు, మోహనరావు, గణపతి, రామస్వామిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవికుమార్‌ తెలిపారు.

ముగిసిన అంత్యక్రియలు

మరోవైపు ఉపాధ్యాయుడు కృష్ణ (58) అంత్యక్రియలు ఇవాళ ఉద్దవోలులో ముగిశాయి. కృష్ణ స్వగ్రామమైన ఉద్దవోలులో పోలీసు పికెటింగ్‌ కొనసాగుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని