Chandrababu: సీఎంకు బాధ్యత ఉండక్కర్లేదా.. రైతుల వద్దకు ఎందుకు రారు?: చంద్రబాబు

రాష్ట్రంలో రైతుల బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలో గురువారం ఆయన పర్యటించారు.

Updated : 04 May 2023 16:31 IST

ఏలూరు: రాష్ట్రంలో రైతుల బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలో గురువారం ఆయన పర్యటించారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మొలకలు వచ్చిన ధాన్యాన్ని చంద్రబాబుకు చూపిస్తూ.. రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. చిరిగిన సంచులు ఇచ్చారు చూడండంటూ వాటిని చూపించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ఈ నాలుగేళ్లలో ఎప్పుడైనా జగన్‌ పొలంలో దిగారా? సీఎంకు బాధ్యత లేదా.. రైతుల వద్దకు ఎందుకు రారు? అన్నదాతలు ఇబ్బందుల్లో ఉంటే ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపనా? అది కూడా గతంలో శంకుస్థాపన చేసిన దానికే మళ్లీ చేస్తారా? ధాన్యం సంచులు కూడా ఇవ్వలేని ప్రభుత్వాన్ని ఏమనాలి? రైతులకు న్యాయం జరిగేవరకు అండగా ఉంటా’’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని