Chandrababu: రైతుల కష్టాలు జగన్‌కు ఏం తెలుసు?: చంద్రబాబు

జగన్‌కు.. ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రికి రైతుల కష్టాలెలా తెలుస్తాయని ప్రశ్నించారు. 

Updated : 08 Dec 2023 19:17 IST

అమర్తలూరు: జగన్‌కు.. ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఎద్దేవా చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రికి రైతుల కష్టాలెలా తెలుస్తాయని ప్రశ్నించారు. గుంటూరు (Guntur) జిల్లా అమర్తలూరులో పర్యటించిన చంద్రబాబు.. తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రకృతి విపత్తుకు మానవతప్పిదం తోడవడం వల్లే తీవ్ర నష్టం జరిగిందన్నారు.

‘‘తుపాను బాధిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్ర ఆవేదన కలిగించింది. చేతికందిన పంట నీట మునిగిన వేళ రైతుల కష్టం చూస్తే బాధేస్తోంది. ప్రభుత్వం వెంటనే బాధిత రైతులను ఆదుకోవాలి. పంటకాలువల్లో పూడిక తీయలేదు, రైతులకు గోనె సంచులు ఇవ్వలేదు. తెదేపా పాలనలో పంట కాలువల మరమ్మతులు తరచుగా జరిగేవి. వర్షాలు రాకముందే కాలువల్లో పూడికలు తీయాలి. ఈ ప్రభుత్వం నాలుగేళ్లుగా పంట కాలువలను పట్టించుకోలేదు. రైతులు ఆందోళన చేస్తేనే సాగునీరు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ సీఎంకు వ్యవసాయం, రైతుల కష్టాల గురించి తెలియదు. తుపాను వల్ల చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు పంట నష్టం జరిగింది. తుపాను బాధిత రైతుల వద్దకు అధికారులు వెళ్తున్నారా? సమర్థ ప్రభుత్వం లేకుంటే వ్యవస్థలు సరిగా పనిచేయవు. ఐదేళ్లుగా పంటల బీమా మొత్తం రైతులకు అందుతోందా?విపత్తులు వచ్చినప్పుడే ప్రభుత్వ సమర్థత ఎలాంటిదో తెలుస్తుంది’’ అని చంద్రబాబు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు