Chandrababu:: కుప్పంలో చంద్రబాబు ఇంటింటి ప్రచారం

తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Updated : 26 Mar 2024 16:51 IST

కుప్పం: తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పార్టీ నేతలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణ వాసులు పెద్దసంఖ్యలో చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సారి కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో తమ అభిమాన నాయకుడిని గెలిపించుకుంటామని స్థానికులు పేర్కొన్నారు. రెండు నెలల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. ఆ తర్వాత చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు స్థానికులకు వివరించారు.

అర్చకుడిపై దాడి.. హేయమైన రాక్షస చర్య: చంద్రబాబు

కాకినాడలోని శివాలయంలో అర్చకుడిపై వైకాపా నేత దాడి ఘటనను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ‘‘అర్చకుడు అంటే దేవుడికీ, భక్తుడికీ మధ్య అనుసంధాన కర్తగా భావించి కాళ్లకు మొక్కే సంప్రదాయం మనది. అటువంటి పూజారులను భక్తుల సమక్షంలోనే కాలితో తన్నడం, దాడి చేయడం హేయమైన రాక్షస చర్య. వైకాపా నేతల అధికార మదానికి, మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపునకు ఇది నిదర్శనం. ఈ ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లు వరుసగా దేవాలయాల్లోని విగ్రహాలపై దాడులు జరిగాయి. ఒక్క కేసులోనూ నిందితులపై చర్యలు లేవు. ఇప్పుడు ఏకంగా గుడిలో అర్చకులపైనే దాడి చేసే పరిస్థితి వచ్చింది. నిందితుడిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని