Chandrababu: పింఛన్ల పంపిణీపై కుట్రలు చేస్తున్నారు: చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు.

Updated : 02 Apr 2024 22:19 IST

అమరావతి: రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ‘‘పింఛన్ల పంపిణీ బాధ్యతను సీఎం సరిగా నిర్వహించట్లేదు. వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పింఛన్ల పంపిణీపై కుట్రలు చేస్తున్నారు. వాలంటీర్లతో నగదు పంపిణీ బాధ్యతలను ఈసీ తప్పించింది. ప్రభుత్వ ఉద్యోగులతో ఇళ్ల వద్దే పింఛన్లు ఇవ్వాలని ఈసీ చెప్పింది. ముందే బ్యాంకుల నుంచి నగదు విత్‌ డ్రా చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. పింఛనుదారులకు ఇవ్వాల్సిన సొమ్ము కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. నిధుల కొరత వల్లే పింఛన్ల పంపిణీ జాప్యం చేస్తున్నారు. పింఛన్ల పంపిణీపై లబ్ధిదారులకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. జగన్‌ ప్రభుత్వం కుంటిసాకులు చెప్పడం రాజకీయ కుట్రే’’ అని లేఖలో పేర్కొన్నారు.

ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు ఇచ్చేలా ఆదేశించండి: ఈసీని కోరిన చంద్రబాబు

‘‘ఏపీలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో వృద్ధులు, దివ్యాంగులు.. ఇతర పెన్షన్ లబ్దిదారులను 3-4 కిలోమీట్లర్ల దూరంలో ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ తిప్పించుకోవడం మానవత్వం అనిపించుకోదు. అందుకే పింఛన్లను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేసేలా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సూచించండి’’ అని కోరుతూ భారత ప్రధాన ఎన్నికల అధికారికి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని