Chandrababu: పేదరికం లేని సమాజాన్ని చూడటమే నా జీవిత ఆశయం: చంద్రబాబు

జగన్‌ పాలనలో ప్రజల ఆదాయం తగ్గి.. ఖర్చులు విపరీతంగా పెరిగాయని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు.

Published : 31 Mar 2024 20:48 IST

బాపట్ల: పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన జీవిత ఆశయమని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. జగన్‌ పాలనలో ప్రజల ఆదాయం తగ్గి.. ఖర్చులు విపరీతంగా పెరిగాయని దుయ్యబట్టారు. బాపట్లలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. తన మీద కేసులు పెట్టినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని చెప్పారు.

‘‘తుపాను వచ్చి రైతులు దెబ్బతింటే ప్రభుత్వం పట్టించుకోలేదు. బాధిత రైతులకు పరిహారం కూడా చెల్లించలేదు. రైతులంటే వైకాపా ప్రభుత్వానికి కనీస గౌరవం లేదు. నేను పట్టిసీమ కట్టానని దానిద్వారా నీళ్లు రాకుండా అడ్డుకున్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం. ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్‌. ఈ ఎన్నికల్లో విజయం సాధించి.. రాష్ట్రాన్ని గాడిలో పెడతా. మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తా. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం ద్వారా ప్రతి పిల్లవాడికి రూ.15 వేలు ఇస్తాం. ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని