Chandrababu: కౌంటింగ్‌ రోజు అప్రమత్తంగా ఉండాలి.. పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌

ఓటమికి కారణాలు వెతుకుతున్న వైకాపా నేతలు ఈసీ, పోలీసుల తీరుపై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు.

Published : 29 May 2024 17:39 IST

అమరావతి: ఓటమికి కారణాలు వెతుకుతున్న వైకాపా నేతలు ఈసీ, పోలీసుల తీరుపై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. విదేశీ పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నాక పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శుక్రవారం పార్టీ చీఫ్ ఎలక్షన్‌ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం కావాలని నిర్ణయించారు. 

జూన్‌ 1న జోనల్‌ స్థాయిలో కౌంటింగ్‌ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలని నేతలకు ఆదేశించారు. ఈ రెండు కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలని నేతలకు సూచించారు. కౌంటింగ్‌ రోజు బందోబస్తుపై ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించారు. 175 నియోజకవర్గాలకు 120 మంది పరిశీలకులను నియమించడం పట్ల తెదేపా అభ్యంతరం వ్యక్తం చేసింది. పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. వాటిపై వైకాపా చేస్తున్న రాద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. శుక్రవారం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, భాజపా నేతలు భేటీ అయ్యే అవకాశమున్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని