Chandrababu: ఏపీలో ఎన్డీయేకు జేపీ మద్దతు.. స్వాగతించిన చంద్రబాబు

ఏపీలో ఎన్డీయే కూటమికి జయప్రకాశ్‌ నారాయణ మద్దతు ఇవ్వడంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు.

Published : 20 Mar 2024 21:04 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా, జనసేన, భాజపా (ఎన్డీయే) కూటమికి మద్దతు ఇస్తున్నట్లు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ (జేపీ) ప్రకటించడంపై తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) స్పందించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జేపీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ కోసం  ఏర్పడిన కూటమికి మద్దతు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు. తీవ్ర ప్రమాదంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు భావసారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు కలిసి రావాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు.

జయప్రకాష్ నారాయణ వంటి నిష్ణాతుడైన మేధావి తమ కూటమికి మద్దతుగా నిలవడం హర్షణీయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు తన వంతు సహకారం అందిస్తున్నందుకు ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని