Chandrababu: 28న దిల్లీకి తెదేపా అధినేత చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈనెల 28న దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో అక్రమంగా ఓట్ల తొలగింపు వ్యవహారంపై.. 28న దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు.

Updated : 22 Aug 2023 11:53 IST

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈనెల 28న దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో అక్రమ ఓట్ల తొలగింపు వ్యవహారంపై.. దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ఓట్ల తొలగింపులో ‘ఊరూరా ఉరవకొండ’ లాంటి ఘటనలు ఉన్నాయని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైకాపా సానుభూతిపరుల దొంగ ఓట్లు చేర్చడం.. తెదేపా అనుకూల ఓట్లు తొలగించడంపై ఫిర్యాదు చేయనున్నారు.

వాలంటీర్ల ద్వారా తెదేపా - వైకాపా అనుకూల ఓట్ల సమాచారం సేకరించి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఎన్నికల సంఘం దృష్టికి ఆయన తీసుకెళ్లనున్నారు. ఓట్ల అక్రమాలపై ఉరవకొండ, పర్చూరు, విజయవాడ సెంట్రల్, విశాఖ తదితర ఘటనల సాక్ష్యాలను సీఈసీకి చంద్రబాబు అందించనున్నారు. తెలుగుదేశం నేతల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోవట్లేదనే విషయాన్ని కూడా సీఈసీకి  నివేదించనున్నారు.

ఏపీలో ఓట్ల జాబితాలో అక్రమాలపై సమాచార సేకరణకు ఇప్పటికే తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. వచ్చిన సమాచారం మొత్తాన్ని క్రోడీకరించి సీఈసీకి తెలుగుదేశం పార్టీ సమర్పించనుంది. అక్రమాలు నివారించటంతో పాటు బాధ్యులైన ప్రతి అధికారిపైనా ఉరవకొండ తరహా చర్యలు తీసుకోవాలని సీఈసీని చంద్రబాబు కోరనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని