Chandra Babu: తుపాను బాధితులకు ప్రభుత్వం ₹25వేల ఆర్థిక సాయం అందించాలి: చంద్రబాబు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు (ChandraBabu) రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో ఆయన పర్యటించారు.

Published : 09 Dec 2023 14:25 IST

బాపట్ల: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు (ChandraBabu) రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శనివారం జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో ఆయన పర్యటించారు. తుపాను వల్ల సర్వం కోల్పోయామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా లేక నాలుగు రోజులు చీకట్లోనే గడిపామని కాలనీ వాసులు తమ బాధను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో రహదారి లేక రోజులు తరబడి బురదలోనే గడిపామని స్థానికులు వాపోయారు. ఆదుకునేందుకు ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని కాలనీ వాసులు ఆరోపించారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులకు చంద్రబాబు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేశారు. బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ‘‘ఎస్టీ కాలనీలో ఎక్కడ చూసినా వరద నీరే. నాలుగు రోజులు మీరంతా నీళ్లలోనే ఉన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలోనే ఇంత దారుణ పరిస్థితులు ఉండటం దుర్మార్గం. తెదేపా (TDP) తరఫున ఒక్కో ఇంటికి ₹5వేల సాయం అందిస్తున్నాం. ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి ₹25వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలి. గత ఎన్నికల్లో తెదేపాకు ఓటు వేశారనే కాలనీ వాసులపై కక్షగట్టారు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు