Chintamaneni: గులకరాయి డ్రామా ఫెయిల్‌.. జగన్‌ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండాలి: చింతమనేని

సీఎం జగన్‌పై రాయి దాడి నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు జాగ్రత్తగా ఉండాలని తెదేపా (TDP) మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ (Chintamaneni) అన్నారు.

Published : 15 Apr 2024 14:49 IST

అమరావతి: సీఎం జగన్‌పై రాయి దాడి నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు జాగ్రత్తగా ఉండాలని తెదేపా (TDP) మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ (Chintamaneni) అన్నారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో జగన్‌ నటిస్తున్నారని విమర్శించారు. ‘‘గత ఎన్నికల్లో బాబాయ్‌ గొడ్డలిపోటుతో సానుభూతి పెంచుకున్నారు. ఇప్పుడు గులకరాయి డ్రామా విఫలమవడంతో ఎవరైనా బలికావొచ్చు. విజయమ్మ ముందు జాగ్రత్తగా అమెరికా వెళ్లారని ప్రజలు అనుకుంటున్నారు. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి కూడా జైలులోనే ఉంటా.. బయటకు రానంటున్నారు’’అని చింతమనేని వ్యాఖ్యానించారు. 

దృష్టి మరల్చేందుకే ఈ డ్రామా: జీవీ ఆంజనేయులు

సిట్‌ కార్యాలయంలో ఆధారాల ధ్వంసం ఘటన నుంచి దృష్టి మరల్చేందుకే జగన్‌ గులకరాయి నాటకం ఆడారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసుల ఆధారాలను కాల్చేశారని ఆరోపించారు. వినుకొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆధారాల ధ్వంసం వ్యవహారంలో సీఐడీ, సిట్‌ అధికారులు అడ్డంగా దొరికారని.. వీటితో పాటు ట్యాపింగ్‌ ఉచ్చు వారి మెడకు చుట్టుకోబోతోందన్నారు. ఆ అధికారులతో పాటు తనను తాను కాపాడుకునేందుకే జగన్‌ సెంటిమెంట్‌ డ్రామా ఆడారని ఆరోపించారు. ఎన్ని నాటకాలాడినా ఓటమి, కేసుల నుంచి ఆయన తప్పించుకోలేన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని