TDP: తెదేపా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన స్థానాలివే!

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పోటీ చేయనున్న 10 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంతో తెలుగుదేశం పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది.

Updated : 27 Mar 2024 21:16 IST

మరావతి: సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పోటీ చేయనున్న 10 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంతో తెలుగుదేశం పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. భాజపా, జనసేనతో పొత్తులో భాగంగా తెదేపాకు 144 అసెంబ్లీ స్థానాలు కేటాయించగా.. 139 చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం ప్రకటించిన మొదటి జాబితా అభ్యర్థుల్లో పి.గన్నవరం, అనపర్తి, అరకు స్థానాలను జనసేన, భాజపాకు సర్దు బాటు చేశారు.దీంతో ఇంకా.. చీపురుపల్లి, పాడేరు, భీమిలి, దర్శి, రాజంపేట, ఆలూరు, అనంతపురం, గుంతకల్లు స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. 

పొత్తులో భాగంగా జనసేనకు 21 స్థానాలు కేటాయించగా.. ఇప్పటి వరకు  18 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. రెండ్రోజుల్లో ఫైనల్‌ చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలతో చెప్పినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని