Anantapur: తాగునీటి ప్లాంట్‌ వద్ద గొడవ.. తెదేపా, వైకాపా నాయకుల ఘర్షణ

తాగునీటి కోసం వైకాపా, తెదేపా నాయకులు ఘర్షణకు దిగారు. ఈ ఘటన అనంతపురం జిల్లా డి.హీరేహాల్‌ మండలం సిద్ధాపురంలో చోటుచేసుకుంది.

Updated : 24 May 2024 12:54 IST

డి.హీరేహాల్‌: తాగునీటి కోసం వైకాపా, తెదేపా నాయకులు ఘర్షణకు దిగారు. ఈ ఘటన అనంతపురం జిల్లా డి.హీరేహాల్‌ మండలం సిద్ధాపురంలో చోటుచేసుకుంది. శుద్ధ జల ప్లాంట్‌ వద్ద తాగునీరు పట్టుకుంటూ మహిళలు గొడవపడ్డారు. ఈ గొడవలో వైకాపా నాయకులు జోక్యం చేసుకోవడంతో.. వారిని అడ్డుకోవడానికి తెదేపా నాయకులు వచ్చారు. వైకాపా వర్గీయులు దాడి చేయడంతో.. ఆరుగురు తెదేపా నేతలకు గాయాలయ్యాయి. వీరిని బళ్లారి విమ్స్‌కు తరలించారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని